సీనియర్ నటి జయలలిత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం రుద్రంకోట. అనిల్, విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. జయలలిత సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవల సెన్సారును పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో ఆలేఖ్య, బాచి, రమ్య తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ శశ్మాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం అన్నారు. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ వారు గ్రాండ్ గా విడుదల చేయడానికి ముందుకొచ్చారు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి. ఆగస్టు నెలలో స్క్రీన్ మ్యాక్స్ సంస్థ ద్వారా విడుదల కానుంది.