టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు జరిగిన తుంటి మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని డాక్టర్లు చెప్పారని, ఆయన కోలుకునేందుకు ఆరు వారాల సమయం పడుతుందని వివరించారని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు అన్నారు.