అమెరికాలోని బే ఏరియాలో ఉన్న శాన్ రామన్ స్పోర్ట్స్ పార్క్‌లో ట్రై వ్యాలీ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి 74వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోనే టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని వారు ఆశా భావం వ్యక్తం చేశారు. చంద్రబాబు మద్దతుదారులు NRI TDP & Happy Birthday CBN అనే సందేశం ఉన్న బ్యానర్‌లను, టీడీపీ గొడుగులను ప్రదర్శించారు. మహిళలు పసుపు చీరలను ధరించి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు.
ఈ వేడుకలో చిన్నారులు, ఎన్నారై టీడీపీ పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ట్రై వ్యాలీ ఎన్నారై టీడీపీ నాయకులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు చంద్రబాబు నాయుడు ఆయురా రోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉన్న విస్తృత అనుభవం, వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల కోసం టీడీపీ ప్రచారానికి ఆయన ప్రస్తుత నాయకత్వాన్ని హైలైట్ చేస్తూ, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఇంటింటికి తిరిగి మహిళా ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమాన్ని ట్రై వ్యాలీ ఎన్నారై టీడీపీ నాయకుడు ఎంవీ రావు సమన్వయ పరిచారు. ఈ వేడుకల్లో టీడీపీ ఎన్నారై నేతలు సురేష్ పోతినేని, శ్రీనివాస్ శాఖమూరి, నరేష్ జంపని, శ్రీనివాస్ మైనేని, బాలకృష్ణ కంతేటి, రామ్ బైరపనేని, చెన్న క్రిష్ణయ్య, హరిబాబు బొప్పుడి, నరహరి మర్నేని, సతీష్ వేమూరి, రజని కాకర్ల, రామ్ మద్దినేని, సత్యన్నారాయణ ఆలపాటి, ఆదినారాయణ, రామ్ ప్రసాద్ చోడె, తదితరులు పాల్గొన్నారు.