దాదాపు 17ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా చంద్రముఖి-2. ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు. కంగానా రనౌత్ కీలక పాత్రలో నటిస్తు న్నారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమర్, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తు న్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఈ సినిమాను వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్ మాసంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


