భారత్ – చైనా దేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కి చైనా అధికారికంగా ఆహ్వానం పలికింది. 2020లో గల్వాన్ లోయ లో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు.

ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని మోదీ హాజరుకానున్న విషయాన్ని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ధృవీకరించారు.
















