
నీటి పంపకంపై భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా చైనా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోలైజేషన్ ఉపాధ్యక్షుడు విక్టర్ జికాయ్ గవో బీజింగ్‌లో ప్రకటించారు. పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందంపై భారత్ వైఖరి పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరుల పట్ల తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా ఇతరులు అలాగే వ్యవహరిస్తారు అని గ్రహించాలని ఆయన పేర్కొన్నారు. చైనా మిత్రుడైన పాకిస్థాన్‌కు నీరు రాకుండా భారత్ అడ్డుకుంటే భారత్‌లోకి నీరు ప్రవహించకుండా చైనా కూడా అడ్డుకోగలదని ఆయన హెచ్చరించారు.
