తైవాన్‌కు ఆయుధాలు, ఇతర సైనిక సహాయం అందిస్తామన్న అమెరికాపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిప్పుతో అమెరికా చెలగాటమాడుతున్నదని మండిపడింది. తైవాన్‌కు 571 మిలియన్ డాలర్ల విలువైన యుద్ధ పరికరాలు, సేవలను, సైనిక విద్య, శిక్షణను తైవాన్‌కు ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ శనివారం ఆమోదం తెలిపారు. అమెరికా రక్షణ శాఖ 295 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ, తైవాన్ జలసంధిలో శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగించే ప్రమాదకర చర్యలను ఆపాలని అమెరికాను హెచ్చరించింది. తైవాన్‌కు ఆయుధాలను ఇవ్వొద్దని చెప్పింది. తమ రక్షణ కోసం అమెరికా ప్రభుత్వం నిబద్ధతను తైవాన్ ధ్రువీకరించింది.