అంతరిక్ష ప్రయోగాల్లో చైనా వ్యోమగాములు కొత్త రికార్డును సృష్టించారు. మొదటిసారిగా రోదసిలో చేపలను పెంచారు. నవంబర్ 4న ముగిసిన షెన్‌జౌ-18 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని జరిపారు. అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో జలచరాల మనుగడ సాగించగలవా అనేది తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. ఇందుకోసం మనుషుల జన్యువులతో కొంత పోలి ఉండే, త్వరగా పెరిగే జీబ్రాషిఫ్‌లను ఎంచుకు న్నారు. నాలుగు జీబ్రాషిఫ్‌లను చైనా అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లి, అక్కడ ఓ అక్వేరియంలో పెంచారు. పెరగడం నుంచి పునరుత్పత్తి వరకు 43 రోజుల్లో వీటి పూర్తి జీవచక్రం అంతరిక్షంలోనే పూర్తయ్యింది. అంతరిక్ష జీవ శాస్త్రంలో ఇది కీలక మైలురాయి అని చైనా పరిశోధకులు పేర్కొన్నారు.