తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సతీమణి సురేఖతో కలిసి ప్రజాభవన్‌కు వచ్చిన చిరంజీవి, అక్కడ డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి దంపతులకు డిప్యూటీ సీఎం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ కాసేపు మాట్లాడు కున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని చిరంజీవి శాలువాతో సత్కరించారు. అనంతరం చిరంజీవి దంపతులకు సైతం భట్టి సత్కారం చేశారు.
