క్రిస్మస్ వేళ మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. కంగ్‌పోక్పీ జిల్లాలోని సినమ్‌కోమ్ గ్రామంలో ఉదయం 6:30 గంటల సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. కొండ ప్రాంతంలో విలేజ్ వాలంటీర్స్ పేరుతో కొందరు బాంబు దాడులకు పాల్పడుతూ కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. దీంతో హుటాహుటిన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. మరోవైపు చురాచంద్‌పూర్ జిల్లా లెయిసంగ్ గ్రామంలోని బ్రిడ్జి కింద దుండగులు అమర్చిన 3.6 కేజీల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.