మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పాత తప్పిదాలను మరచిపోయి శాంతియుతంగా, సుఖసంతోషాలతో సహజీవనం సాగించాలన్నారు. గడచిన నాలుగు మాసాలుగా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని, దీన్ని బట్టి కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొంటాయన్న ఆశ తనలో ఏర్పడుతోందన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని, పాత పొరపాట్లను అన్ని వర్గాలవారు మన్ని ంచి, విస్మరించి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరారు. ఘర్షణలు జరిగినప్పటి నుంచి ప్రధాని ఎందుకు రాష్ట్రంలో పర్యటించలేదని విపక్షాలు ఆయనను ప్రశ్నించాయి.