దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తెచ్చే ప్రయత్న చేస్తున్నారు. ఈ క్రమంలో సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో హ్యుందాయ్ మోటర్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. హ్యుందాయ్‌కి చెందిన హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. హైదరాబాద్ లోని ఇంజినీరింగ్ సెంటర్‌ను హ్యుందాయ్ ఆధునికీకరించనుంది. మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది.


