Namaste NRI

పోయి రా మావా అంటోన్న ధనుష్‌.. కుబేర ఫస్ట్‌ సాంగ్ రిలీజ్

ధనుష్‌ కథానాయకుడిగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కుబేర. రష్మిక మందన్నా కథానాయిక. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. పోయిరా పోయిరా పోయిరా  పోయిరా మామా అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రాయగా, దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచారు. తమిళంతో పాటు తెలుగులో కూడా హీరో ధనుష్‌ స్వయంగా ఈ పాట పాడటం విశేషం.

అతని గాత్రంలోని మాగ్నెటిక్‌ ఫోర్స్‌ పాటను మరోస్థాయికి తీసుకెళ్లిందని, శేఖర్‌ వి.జె కొరియోగ్రఫీ పాటకు ప్రాణం పోసిందని మేకర్స్‌ చెబుతున్నారు. వన్‌డే హీరో నువ్వే ఫ్రెండూ నీ కోసమే డబుల్‌ సౌండూ  అస్సల్‌ తగ్గక్‌ అట్నే ఉండూ  మొక్కుతారూ కాళ్లు రెండూ అంటూ హీరో నైజాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. పెళ్లి ఊరేగింపులో ధనుష్‌ ఆడిపాడుతూ ఈ పాటలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో జిమ్‌ సార్భ్‌ కీలక పాత్రధారి. జూన్‌ 20న సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రానికి నిర్మాణం: శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రై.లిమిటెడ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events