విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ`పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిరచారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాత కాలం నాటి పేపర్ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్ పాస్‌పోర్టులు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ప్రయాణాల సమయంలో ఇమిగ్రేషన్ ప్రక్రియ సులభతరం అయ్యేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఈ`పాస్‌పోర్ట్ ప్రధాన ఫీచర్లను మంత్రి వెల్లడిరచారు. ప్రపంచంలో ఇప్పటిక పలు దేశాలు చిప్ ఆధారిత పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాయి.














