అగ్ర హీరో వెంకటేష్ నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తు న్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయి కలు. అనిల్ రావిపూడి దర్శకత్వం. ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా గోదారి గట్టు మీద రామ సిలకవే అనే పాటను విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ పాటను భాస్కరభట్ల రచించగా రమణ గోగుల, మధుప్రియ ఆలపించారు.గోదారి గట్టు మీద రామ సిలకవే..గోరింటాకెట్టుకున్న సందమామవే.. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్దర పోయిందే. ఆరాటాల న్నీ తీరకపోతే ఏం బాగుంటుందే అంటూ కాస్త జానపద శైలిలో సాగిన ఈ పాటలో భార్యాభర్తల మధ్య బంధాన్ని, వారి మధ్య చిలిపి సరదాలను ఆవిష్కరించారు. షూటింగ్ పూర్తికావొస్తున్నదని, క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.