Skip to main content

Namaste NRI

ఆగస్టు 19న కమిట్‌మెంట్‌

టాలీవుడ్‌లో అందరిని దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్రెసింగ్‌ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్‌ సమర్పణలో ఎఫ్‌ 3 ప్రొడక్షన్స్‌ మరియు పుట్‌లూస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న చిత్రం కమిట్‌మెంట్‌. తేజస్వి మడివాడ, అన్వేషి జైన్‌, సీమర్‌ సింగ్‌, తనిష్క్‌ రాజన్‌. రాజా రవీంద్ర, అమిత్‌ తివారి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కె.చెన్న దర్శకత్వంలో  నీలిమ తాడూరి, బల్దేవ్‌ సింగ్‌ నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. నీలిమా  తాడూరి, బల్దేవ్‌ సింగ్‌ మాట్లాడుతూ నాలుగు ఆసక్తికరమైన కథలతో రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. మా సినిమా పనిచేసిన ప్రతిఒక్కరూ సపోర్టు చేసిన మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారన్నారు.

Social Share Spread Message

Latest News