Namaste NRI

కమిటీ కుర్రోళ్లు ఆ తరహా సినిమానే : మెగాస్టార్

నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. యదువంశీ దర్శకుడు. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌.ఎల్‌.పి, శ్రీరాధా దామోదర్‌ స్డూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. నాగబాబు, వరుణ్‌తేజ్‌, సాయిదుర్గతేజ్‌, అడివిశేష్‌, వెంకీ అట్లూరి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు.

కొత్తదనం ఉన్న మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. కమిటీ కుర్రోళ్లు ఆ తరహా సినిమానే. ఇది గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే కథ. నిహారిక మల్టీ టాలెంటెడ్‌. మంచి చిత్రాల ను నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. ఈ సినిమా నేను చూశాను. చాలా బాగుంది. ఈ నెల 9న రాబోతున్నది. మీకూ నచ్చుతుంది. తప్పకుండా చూడండి అంటూ మెగాస్టార్ చిరంజీవి వీడియో ద్వారా సందేశం ఇచ్చారు.

ఈ సినిమా విడుదలయ్యాక దర్శకుడు యదువంశీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. టెక్నికల్‌ టీమ్‌ మొత్తం మనసుపెట్టి పనిచేశారు. కొత్తవాైళ్లెనా అందరూ అద్భుతంగా నటించారు. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం అని నిహారిక కొణిదెల ఆశాభావం వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News