భాగవతం ఆణిముత్యాలు (ఐ`బీఏఎం) ఆధ్వర్యంలో సింగపూర్‌లో రవి కాంచిన పోతన భాగవతం పద్య పఠనపు పోటీలు `2022 జరుగుతున్నాయి. తెలుగు భాగవతి ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ద్వారా జరుగుతున్న ఈ పోటీల్లో సింగపూర్‌లో జరుగుతున్నాయి. సింగరూర్లో ఉన్న ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో 2 రౌండ్స్ ఉంటాయి. 1. పోతన రౌండ్, 2. గజేంద్ర రౌండ్ . పోతన రౌండ్ ఆగస్టు 6 / 7లలో జరుగుతుంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు గజేంద్ర రౌండ్‌కు అర్హత సాధిస్తారని తెలిపారు. పోటీ నియమ నిబంధనలు తదితర వివరాల కోసం https://ibamcontests.blogspot.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు ఫాం ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.














