Namaste NRI

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, వెంకయ్యనాయుడు, హాజరయ్యారు. ఇటీవలే జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయనకు 452 ఓట్లు రాగా, విపక్షానికి చెందిన ఆయన ప్రత్యర్థి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 152 ఓట్ల తేడాతో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ విజయం సాధించారు.

Social Share Spread Message

Latest News