
భారత 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి, కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నిర్వహించింది. ఎన్నికల్లో మొత్తం 767 మంది ఎంపీలు ఓటు వేశారు. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, కూటమి అభ్యర్థి అయిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 17 మంది ఎంపీలు గైర్హాజరవగా, 15 ఓట్లు చెల్లకుండా పోయాయి.
















