Namaste NRI

తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో.. సీపీఆర్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని హిందూ టెంపుల్‌ లో సీపీఆర్ అండ్ ఏఈడీ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడే నైపుణ్యాలను నేర్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు కుటుంబాల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం 30 మందికి శిక్షణ అందించారు. పరీక్ష నిర్వహించి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నుంచి సర్టిఫికేషన్ అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తానా అధ్యక్షులు నరేన్ కొడాలి. హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మాధురి యెలూరి, కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు కీలకంగా వ్యవహరించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ నాదెళ్ల భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య సహకారం అందించిన జేవియర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యాజమాన్యానికి తానా న్యూయార్క్ టీమ్ కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమానికి న్యూయార్క్‌లోని స్థానిక సంస్థలైన టీఎల్‌సీఏ అధ్యక్షులు శ్రీ సుమంత్ రామశెట్టి, ఎన్‌వైటీటీఏ అధ్యక్షులు రవీంద్ర కోడెల హాజరై, తానా న్యూయార్క్ టీమ్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను అభినందించారు. ముఖ్యంగా సీపీఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సమాజానికి ఎంతో ఉపయోగకరమైందని పేర్కొంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ భర్తవరపు గారు మాట్లాడుతూ సమాజ సేవే లక్ష్యం్ణ అనే నినాదంతో తానా న్యూయార్క్ టీమ్ భవిష్యత్తులో కూడా మరిన్ని సార్థకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలుస్తుందని తెలిపారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events