Namaste NRI

ఫ్లోరిడాలో దుర్ఘ‌ట‌న… ఇండ్ల‌పై కూలిన విమానం 

అమెరికాలోని ఫ్లోరిడా మొబైల్ పార్క్ వ‌ద్ద ఓ చిన్న‌పాటి విమానం కూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. బీచ్‌క్రాఫ్ట్ బొనాంజా వీ35 సింగిల్ ఇంజిన్ విమానంలో సాంకేతిక స‌మ‌స్య వ‌చ్చిన‌ట్లు దాని పైలెట్ వెల్ల‌డించాడు. ఆ ప్లేన్ కూల‌డానికి ముందు అత‌ను ఈ విష‌యాన్ని చెప్పాడు. క్లీన్‌వాట‌ర్ ప్రాంతంలోని బేసైడ్ వాట‌ర్స్ మొబైల్ హోమ్ పార్క్ వ‌ద్ద ఆ విమానం కూలింది. ఒక ఇంటిని ఢీకొన‌గా, మ‌రో మూడు ఇండ్ల‌కు నిప్పు అంటుకున్న‌ది. విమానంలో ఉన్న కొంద‌రు, ఇంట్లో ఉన్న వ్య‌క్తులు కూడా మృతి చెందిన‌ట్లు అధికారులు చెప్పారు. ర‌న్‌వే నుంచి 5 కిలోమీట‌ర్ల దూరం వెళ్లిన త‌ర్వాత రేడార్ నుంచి ఆ ప్లేన్ సిగ్నిల్స్ మాయం అయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress