నాగచైతన్య 23వ సినిమా వర్కింగ్ టైటిల్ ఎన్‌సీ23. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఈ సినిమా ప్రకటన వెలువడింది. ఇక అప్పట్నుంచీ ఈ సినిమా కథ గురించి, కథానాయిక గురించి చర్చోపర్చలు జరుగుతూనే వున్నాయి. 2018 నవంబర్ నెలలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన కొందరు మత్య్సకారులు గుజరాత్‌లోని వీరవల్ వద్ద సముద్రంలో చేపలు పడుతూ పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్థాన్ సైనికులకు చిక్కి బందీలుగా మారారు.వారు అనుభవించిన ఏడాదిన్నర జైలు జీవితం, తద్వారా ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదని విశ్వసనీయ సమాచారం. ఇందులో నాగచైతన్య మత్స్యకారునిగా నటించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలల్లో పర్యటించి అక్కడి మత్య్సకారులతో మమేకమై, వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. లవ్‌స్టోరీ’ తర్వాత మళ్లీ ఆమె నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
