షమ్ము హీరోగా, హరీశ్ మధురెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం క్రేజీ రాంబో. ర్యాప్ రాక్ షకీల్ నిర్మాత. ఆయనే సంగీతం కూడా అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ సినిమా టైటిల్‌ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హీరో అశ్విన్‌బాబు విచ్చేచారు. టైటిల్ లాంచ్ ఈవెంట్ లో హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ క్రేజీ రాంబో టైటిల్ చాలా ఇంట్ర స్టింగ్ గా వుంది. సినిమా తప్పకుండా క్రేజీ గా ఉంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్, సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి అని కోరారు. కామెడీ, రొమాన్స్‌తో కూడిన యాక్షన్ డ్రామా ఇదని, ఇందులో రాంబోగా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌ని షమ్ము చేస్తున్నాడని, సాంకేతికంగా నెక్ట్స్ లెవల్లో సినిమా ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. ఈచిత్రానికి కెమెరా: జైపాల్‌రెడ్డి, నిర్మాణం: సప్తాశ్వ ప్రొడక్షన్స్.