సుందర్.సి స్వీయ దర్శకత్వంలో నటించిన హారర్ కామెడీ సిరీస్ అరణ్మనై నుండి వస్తున్న నాల్గవ చిత్రం అరణ్మనై 4. తెలుగులో బాక్ పేరుతో మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తమన్నా, రాశిఖాన్నా కథా నాయికలు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికెట్‌ని పొందింది. మే 3న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి స్పందన వస్తున్నదని, సినిమా కూడా తప్పకుండా అలరిస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఖుష్బు సుంద ర్, ఏసీఎస్ అరుణ్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఇ. కృష్ణమూర్తి అకా కిచ్చ, సంగీతం: హిప్హాప్ తమిళా.