పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలావుంటే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. కొన్ని పాటలు, పతాక సన్నివేశాలకు సంబంధించి భారీ ఫైట్ మాత్రమే ఇక మిగిలివున్నాయని ఫిల్మ్‌వర్గాల వినికిడి.
ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ టీజర్‌ని కూడా మేకర్స్ రెడీ చేస్తున్నారట. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్ట్ 22న ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఇందులోని వీఎఫ్‌ఎక్స్ థ్రిల్ కలిగిస్తాయని, ఎం.ఎం.కీరవాణి స్వరా లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఎంఎం కీరవాణి ఇప్పటి కే క్లారిటీ ఇచ్చారు.సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న సినిమా విడుదల కానుంది.