ఇద్దరు అమెరికన్ విద్యార్థులు త్రికోణమితిని వినియోగించి పైథాగరస్ సిద్ధాంతాన్ని నిరూపించేందుకు ఓ కొత్త విధానాన్ని కనుగొన్నారు. వారి ప్రతిభను చూసి గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. న్యూఓర్లిలోని సెయింట్ మేరిస్ అకాడమీలో సీనియర్ విద్యార్థులైన కాలియా జాక్సన్, నేకియా జాక్సన్‌లు మార్చి 18న అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ (ఎఎంఎస్)లో తమ పరిశోధనను సమర్పించారు. వారి పరిశోధన చారిత్రాత్మకమని, ఎఎంఎస్లో హైస్కూల్ విధ్యార్థులు సాధారణంగా ప్రెజెంట్ చేయలేరని వారి పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. 2000 సంవత్సరాల నాటి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక లంబకోణ త్రిభుజం యొక్క రెండు భుజాల చతురస్రాల మొత్తం, లంబకోణానికి ఎదురుగా ఉన్న కర్ణం యొక్క వర్గానికి సమానంగా ఉంటుందని పేర్కొంది. ఈ సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి శాస్త్రజ్ఞులు చాలా అధ్యయనాలు చేశారు.


