రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఏర్పాటు చేసిన విలాసవంతమైన రహస్య టూర్లలో పాల్గొన్న అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ క్లారెన్స్ థామస్ నిర్వాకం బయటపడింది. దీంతో ఆయనపై అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురుస్తోంది. టెక్సాస్‌లోని డల్లాస్ నగర కేంద్రంగా పనిచేసే రియల్ ఎస్టేట్ డెవలపర్ హర్లాన్ క్రో గత రెండు దశాబ్దాలకు పైగా జస్టిస్ థామస్ కోసం పలు విలాసవంతమైన పర్యటనలను ఏర్పాటు చేశారు. ఆ శత కోటీశ్వరుడి ప్రైవేట్ జెట్‌లో, ఓడలో ఈ పర్యటనలు సాగాయి. సన్నిహిత వ్యక్తిగత మిత్రుల నుండి ఈ రకమైన వ్యక్తిగత ఆతిథ్యం పొందడం గురించి ఎవరికీ చెప్పవద్దంటూ తనకు సూచనలు కూడా చేశారని థామస్ తెలిపారు.


