అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అనగనగా ఒక రాజు, చెడ్డవాళ్లందరూ డాకు అనేవాళ్లు, కానీ మాకు మాత్రం మహారాజ్ అంటూ నెట్ ఫ్లిక్స్ రాసుకోచ్చింది.
