Namaste NRI

అనంతపూరంలో డాకు మహారాజ్‌ సక్సెస్‌ మీట్‌

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ కొల్లి  దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన చిత్రం డాకు మహారాజ్‌. ఆదివారం విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకున్నదని టీమ్‌ ఆనందం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ కొల్లి మాట్లాడారు.  బాలకృష్ణగారి కెరీర్లోని గొప్ప సినిమాల్లో ఒకటిగా డాకు మహారాజ్‌ నిలుస్తుందని గతంలో ఓ ప్రెస్‌మీట్‌ సందర్భంగా నిర్మాత నాగవంశీ అన్నారు. ఆయన ఈ సినిమాను అంత నమ్మారు. ఈరోజు ఆయన నమ్మకం నిజమైంది. ప్రేక్షకుల్లో వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో హిట్‌ అందుకున్నా. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్‌తో వచ్చా. సంక్రాంతి నాకు ప్రత్యేకమైన పండుగలా మారిపోయింది. తమన్‌ సంగీతం, విజయ్‌ కార్తీక్‌ ఛాయా గ్రహణం ఈ సినిమాకు ప్రధాన బలాలు. బాలకృష్ణగారి తర్వాత ఈ సినిమాకు మెయిన్‌ పిల్లర్స్‌ వీరిద్దరే. మనసుపెట్టి సినిమా చేస్తే దాన్ని ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారని డాకు మహారాజ్‌తో రుజువైంది అని అన్నారు.

 ఈ వారం అనంతపూరంలో సక్సెస్‌మీట్‌ నిర్వహించనున్నామని, అద్భుతమైన విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశి రౌతేలా, డీవోపీ విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ కూడా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events