Namaste NRI

రిపబ్లిక్ డే స్పెషల్‌గా డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ విడుదల

మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం డేవిడ్‌ రెడ్డి. మారియా ర్యబోషష్క కథానాయిక. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం. నల్లగంగుల వెంకట్‌రెడ్డి, భరత్‌ మోటుకూరి ఈ పానిండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రిటిష్‌ కాలం నాటి నేపథ్యంతో ఉద్రేకపూరితమైన యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నది. ఇందులో క్రూరులైన బ్రిటిష్‌ పాలకులపై ఎదురు నిలిచి పోరాడిన యోధుడిగా మనోజ్‌ కనిపిస్తారు.రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్లని మేకర్స్‌ విడుదల చేశారు.

రూత్‌ లెస్‌గా బ్రూటల్‌గా ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్న మంచు మనోజ్‌ని ఈ పోస్టర్లలో చూడొచ్చు. ఈ సినిమా ఆద్యంతం యాక్షన్‌ అంశాలతో రూపొందుతున్నదని ఈ రెండు పోస్టర్‌లు చెబుతున్నాయి. డేవిడ్‌ రెడ్డి గా మనోజ్‌ విశ్వరూపం చూపిస్తున్నారని, ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్‌ అయ్యారని, మనోజ్‌ బాడీ లాంగ్వేజ్‌, లుక్స్‌, నటన ఇవన్నీ ఇందులో కొత్తగా ఉంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. హీరోగా ఆయనకు ఈ సినిమా బెస్ట్‌ కంబ్యాక్‌ అవుతుందని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానున్నది. ఆర్‌.పార్తీబన్‌, కాంచన తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆచార్య వేణు, సంగీతం: రవి బస్రూర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events