గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్ ,లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రియమైన ప్రియ. సుజిత్ , బాబు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్రం సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బసి రెడ్డి ,నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ,సీనియర్ జర్నలిస్ట్ పాశం యదగిరి , ప్రొడ్యూసర్ ఎంఆర్ చౌదరి వడ్లపట్ల ముఖ్య అధితులు హాజరై చిత్రయూనిట్ ను అభినందించారు.. సి.హెచ్ సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వాహణలో రూపోందిన ఈ మూవీని మన స్క్రీన్ మ్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా థియేటర్ లలో రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

అనంతరంముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.ఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రం క్వాలిటీ పరంగా హైస్టాండర్డ్స్ ఉంది.. విజువల్స్ ఎక్స్‌ట్రార్డనరీగా తీసారు.. డీఓపీ కి ప్రత్యేక అభినందనలు. కొత్త కుర్రాడైనా హీరో అశోక్ ఎక్స్‌ట్రార్డనరీగా పర్‌ఫార్మ్ చేసారు. హీరో లీషా అందంతో పాటు యాక్టింగ్‌లోనూ చూడముచ్చటగా ఉంది అంటూ చిత్ర యూనిట్‌ని మెచ్చుకున్నారు. ముఖ్యంగా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ దేవా ను, మ్యూజిక్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ శ్రీకాంత్ దేవా తండ్రి గారు ప్రముఖ సంగీత దర్శకులు దేవాతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. దర్శకులు సుజీత్, నిర్మాణ నిర్వహణ సీతారామ్ యాదవ్ ను చిత్ర యూనిట్‌ను అభినందించారు.ఈ కార్యక్రమంలో చౌదరి వడ్లబట్ల ,చిన్న గౌడ్ , పులి అమృత్ , మాయ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ మాయ ,నటుడు శశాంక్ పలువురు పాల్గోన్నారు.
