Namaste NRI

పదే పదే ఖండిస్తున్నా… చైనా మళ్లీ అదే మాట

అరుణాచల్‌ ప్రదేశ్‌పై చైనా మొండి వాదనను భారత్‌ పదే పదే ఖండిస్తున్నా, ఆ దేశం మళ్లీ పాత మాటనే ఎత్తుకుంది. చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వ్యాఖ్యలపై చైనా తాజాగా స్పందించింది. అరుణాచల్‌ను భారత్‌ ఆక్రమించుకుందని మరోమారు నోరుపారేసుకుంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్‌ జియాన్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.  భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కాలేదు. గతంలో అరుణాచల్‌ చైనాలో భాగంగానే ఉండేది. ఆ ప్రాంతంలో చైనా పరిపాల న కూడా సాగేది. 1987లో భారత్‌ ఆక్రమించుకొని అరుణాచల్‌ ప్రదేశ్‌గా మార్చుకుంది అని పేర్కొన్నారు. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన అనంతరం, ఆ భూభాగం తమదేనంటూ చైనా పదే పదే ప్రకటనలు చేస్తున్నది. చైనా ఈ విధంగా ప్రకటనలు విడుదల చేయటం ఈ నెలలో ఇది నాలుగోసారి. అరుణాచల్‌ను ఆ దేశం దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress