అమెరికా స్పెల్లింగ్ బీ కాంపిటీషన్‌లో భారతీయ సంతతి వ్యక్తుల హవ కొనసాగుతోంది. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2023 పోటీల్లో భారతీయ మూలాలు ఉన్న దేవ్ షా విజేతగా నిలిచాడు. 11 అక్షరాలు ఉన్న పదాన్ని చెప్పి 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో అతను psammophile అనే పదాన్ని కరెక్టుగా పలికాడు. 2019, 2021 పోటీల్లోనూ అతను పాల్గొన్నాడు. ఫ్లోరిడాకు చెందిన 14 ఏళ్ల దేవ్ షా psammophile అనే పదాన్ని పలికి కప్‌ను గెలిచాడు. వర్జీనియాకు చెందిన చార్లెట్ వాల్ష్ రెండో స్థానంలో నిలిచాడు. మెర్రియమ్ వెబ్‌స్టర్ ప్రకారం psammophile అంటే మట్టిలో జీవించే పురుగు. psammo అంటే గ్రీకు భాషలో మట్టి. phile అంటే గ్రీకులో ప్రేమ అని అర్థం. స్పెల్లింగ్ పోటీల్లో మొత్తం 11 మిలియన్ల మంది పోటీపడ్డారు. దాంట్లో 11 మంది ఫైనలిస్టులను ఫైనల్ పోటీకి ఎంపిక చేశారు. దేవ్ విక్టరీతో అతని పేరెంట్స్ ఆనందంలో తేలిపోతున్నారు.

గత ఏడాది టెక్సాస్‌కు చెందిన హరిని లోగన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆమె మరో భారతీయ వ్యక్తి విక్రమ్ రాజుపై గెలుపొందారు. అయితే గడిచిన 24 ఏళ్లలో దక్షిణాసియాకు చెందిన సంతతి వ్యక్తులే 22 సార్లు స్పెల్లింగ్ బీ పోటీల్లో నెగ్గారు.

