అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి దేవకీ నందన వాసుదేవ అనే టైటిల్ ఖరారు చేశారు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం. ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ కథనందించారు. మానస వారణాసి కథానాయిక. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఫస్ట్‌గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. నీ బిడ్డకి మరణ గండం..లేదా అతని చేతి లో మరొకరికి మరణం అనే వాయిస్ ఓవర్‌తో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. యాక్షన్ ఘట్టాలు రొమాంచి తంగా సాగాయి. ఏ యుగమైనా ఈ భూమిమీద దేవుడి కంటే రాక్షసుడే ముందు పుడతాడు. వాన్ని చంపడానికి దేవుడు పుడతాడు అనే డైలాగ్ కథా సారాంశాన్ని తెలియజెప్పింది. అశోక్ గల్లా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించా రు. మురారి తరహా సినిమా ఇదని, కమర్షియల్ అంశాలతో ఆకట్టుకుంటుందని, సాయిమాధవ్ బుర్రా సంభాష ణలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు. విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని నిర్మాత సోమినేని బాలకృష్ణ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల.
