Namaste NRI

ధనుష్‌ కెప్టెన్‌ మిల్లర్‌ నుంచి..ఫస్ట్ సింగిల్

ధనుష్‌ హీరోగా  టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌. అరుణ్‌ మథేశ్వరన్‌ దర్శకత్వం.  ఈ మూవీలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. టాలీవుడ్ హీరో సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నా రు. కెప్టెన్‌ మిల్లర్‌ నుంచి ఫస్ట్ సింగిల్ కిల్లర్‌ కిల్లర్‌ ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సాంగ్ లుక్‌లో ధనుష్‌ ఎర్రటి స్కార్ప్‌ కట్టుకున్న కెప్టెన్‌ మిల్లర్‌ చేతిలో తుపాకీతో అగ్రెసివ్‌ లుక్‌లో కనిపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. తాజాగా కిల్లర్‌ కిల్లర్‌ కెప్టెన్‌ మిల్లర్‌ అంటూ సాగే పాటను విడుదల చేశారు.

హేమచంద్ర పాడిన ఈ పాట గూస్‌బంప్స్ తెప్పించేలా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. టైటిల్‌ ట్రాక్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచిపోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ధనుష్‌ కామ్రేడ్‌ అవతార్‌ లో కనిపిస్తూ,  సమరానికి అందరినీ మేల్కొలుపుతున్నట్టుగా ఉంది.  విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌ స్పూర్తితో వస్తోన్న ఈ మూవీ మూడు పార్టులుగా ఉంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌  మరో కీ రోల్‌ పోషిస్తుండగా, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు. కెప్టెన్‌ మిల్లర్‌ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ సరిగమ సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదల చేసిన కెప్టెన్‌ మిల్లర్‌ పోస్టర్లు, టీజర్‌ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తున్న కెప్టెన్‌ మిల్లర్ తెలుగు , తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events