చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ధూం ధాం. సాయికిషోర్ మచ్చ దర్శకుడు. ఎం.ఎస్. రామ్‌కుమార్ నిర్మాత. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ తదితరు లు నటిస్తు న్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. పెళ్లి బరాత్ లో నాయకానాయికలు హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు మట్లాడుతూ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగుతుంది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకు ల్ని మెప్పించే అన్ని అంశాలుంటాయి అని తెలిపారు. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ రామస్వామి, సంగీతం: గోపీసుందర్, కథ, స్క్రీన్‌ప్లే: గోపీ మోహన్, సంభాషణలు: ప్రవీణ్ వర్మ, దర్శకత్వం: సాయికిషోర్ మచ్చ.
