Namaste NRI

తెలుసు కదా లోకి శ్రీనిధి శెట్టి ఎంట్రీ

సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటిస్తోన్న సినిమా తెలుసు కదా. పాపులర్‌ స్క్రీన్‌ రైటర్‌ కోన వెంకట్‌ సోదరి నీరజ కోన డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీఖన్నాఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత స్టిల్ రూపంలో కొత్త అప్‌డేట్‌ను షేర్ చేసుకున్నారు మేకర్స్‌. తెలుసు కదా షూటింగ్‌ సెట్స్‌లో జాయి న్‌ అయింది శ్రీనిధి శెట్టి. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలియజేస్తూ,  శ్రీనిధి శెట్టి సీన్ చేసిన తర్వాత మానిటర్‌లో చెక్‌ చేసుకుంటున్న స్టిల్‌ ఒకటి షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. తెలుగులో రొమాంటిక్ స్టోరీతో ఉత్తేజకరమైన డెబ్యూ జర్నీని ప్రారంభించిన శ్రీనిధి శెట్టి గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తుండగా,  నేషనల్ అవార్డు విన్నింగ్ ఎడిటర్‌ నవీన్ నూలి ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాశ్‌ కొల్లా  కాగా,  కాస్ట్యూమ్‌ డిజైనర్‌ శీతల్ శర్మ. ఈ చిత్రానికి ఎస్ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events