Skip to main content

Namaste NRI

ప్రవాస భారతీయులు ఎక్కువగా దేశానికి వెళ్తున్నారో తెలుసా?

సౌదీ అరేబియా దేశం ప్రవాస  భారతీయులకు  అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది. ఐదేళ్ల క్రితం అత్యధిక శాతం భారతీయులు యూఏఈలో ఉపాధి పొందగా, గతేడాది ఆ స్థానాన్ని సౌదీ అరేబియా కైవసం చేసుకుంది. 2022లో సౌదీలో 1,78,630 మంది భారతీయులకు ఉపాధి పొందారు. సౌదీలో 2021లో సుమారు 32 వేల మంది భారతీయులు ఉద్యోగాలు పొందగా , ఆ మరుసటి ఏడాదే వీరి సంఖ్య అమాంతం పెరిగింది. గతేడాది సౌదీ తరువాత కువేత్‌లోనే  అత్యధికంగా సుమారు 71 వేల మంది భారతీయులు ఉపాధి పొందారు.

2021తో పోలిస్తే 2022లో అక్కడ భారతీయ కార్మికుల సంఖ్య ఏకంగా ఏడు రెట్లు పెరిగింది. బహ్రెయిన్  అత్యల్పంగా 10,232 భారతీయులకు ఉపాధి కల్పించగలిగింది. 2018లో అత్యధికంగా 1.12 లక్షల మంది భారతీయులకు ఉపాధి అవకాశాలు దక్కిన కువేత్‌లో గతేడాది కేవలం 33,233 మంది మాత్రమే ఉపాధి పొందగలిగారు.  భారత్ నుంచి వలసెళ్లిన వారిలో 50 శాతం గల్ఫ్ దేశాల్లోనే ఉపాధి పొందుతున్నారు. ఇక గల్ఫ్ దేశాల్లోని 70 శాతం మంది సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ వర్కర్సే. వృత్తి నిపుణులు, వైట్ కాలర్ సిబ్బంది వాటా 20 నుంచి 30 శాతం వరకూ ఉంటుంది. అతికొద్ది మంది మాత్రం స్థానికుల వద్ద సహాయకులుగా ఉన్నారని  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రానున్న సంవత్సరాల్లో సౌదీ అరేబియాలో భారతీయులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకావం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events