Namaste NRI

డిఫరెంట్‌గా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సైక్ సిద్దార్థ టీజర్

శ్రీనందు, యామిని భాస్కర్‌ జంటగా నటిస్తున్న చిత్రం సైక్‌ సిద్ధార్థ. వరుణ్‌రెడ్డి దర్శకుడు. స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై శ్రీనందు, శ్యామ్‌సుందర్‌ రెడ్డి తుడి నిర్మిస్తున్నారు. టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రతీ చిన్న విషయాన్ని హైపరాక్టివ్‌గా స్పందించే ఓ యువకుడు, అతని స్నేహితుల కారు ప్రయాణం నేపథ్యంలో టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. తాను ఓ పరాజితుడినని చెప్పుకునే హీరోకు మిత్రులు ధైర్యాన్ని అందించడం ఈ క్రమంలో జరిగిన సంఘటనతో టీజర్‌ ఆకట్టుకుంది. నేటి యువతను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నానని, హీరో నందు పాత్రతో చాలా మంది యూత్‌ కనెక్ట్‌ అవుతారని, హైదరాబాద్‌ యాస సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. ప్రియాంక రెబెకా శ్రీనివాస్‌, సాక్షి అత్రీ, మౌనిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.ప్రకాష్‌ రెడ్డి, సంగీతం: స్మరణ్‌, రచన-దర్శకత్వం: వరుణ్‌ రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events