కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్, సిడ్నీ , బ్రిస్బేన్ నగరాల్లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించారు. అలాగే గాయపడిన కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కలను సాకారం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తన భుజస్కందాలపై వేసుకొని మునుపెన్నడూ ఎరుగని విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన కేసీఆర్ కృషిని, పట్టుదలను ప్రశంసించారు. దేశ చరిత్రలో కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష సమయంలో చేసిన త్యాగాలను, రాష్ట్రం సిద్ధించిన తరువాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసిన కృషి, ప్రవేశ పెట్టిన పథకాలు ఎంతో గొప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సాయిరాం ఉప్పు, వినయ్ సన్నీ గౌడ్, విశ్వామిత్ర, ఉదయ్ రెడ్డి, వేణు, సాయి పాల్గొన్నారు.
