నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి జంటగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో దిల్ వాలా సినిమా షురూ అయింది. నబీషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి సన్నివేశానికి నటుడు అలీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. హీరో అల్లరి నరేష్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు. అనంతరం దర్శకుడు వీరభద్రం చౌదరి మాట్లాడుతూ మా నిర్మాతలు నబీ షేక్, తూము నర్సింహాగారు తొలి సినిమాగా దిల్‌వాలాని దర్శకతంలో చేయడం హ్యాపీ. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంబిస్తాం అన్నారు. మెరిసే మెరిసే సినిమా చూసి శ్వేత అవస్తిని కథానాయికగా ఎంపిక చేస్తున్నాం. ఓ క్రైమ్ కామెడీ కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నామన్నారు. నరేష్ అగస్త్య మాట్లాడుతూ తొలిసారి ఒక వాణిజ్యాంశాలతో కూడిన సినిమా చేస్తున్నాం. ఈ కథతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉంది అన్నారు. రాజేంద్ర ప్రసాద్, అలీ, అలీ రెజా, దేవ్‌గిల్, పోసాని, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శంకర్, ఛాయాగ్రహణం: అనిత, సంగీతం: అనూప్ రూబెన్స్.














