భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మోదీతో చర్చించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆ దేశ కాంగ్రెస్ సభ్యులు కోరారు. అమెరికా పర్యటనకు రానున్న భారత ప్రధాని మోదీతో ఈ మేరకు చర్చించాలంటూ సుమారు 60 మంది కాంగ్రెస్ ప్రతినిధులు జో బైడెన్‌కు మంగళవారం లేఖ రాశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో మతపరమైన అసహనం పెరిగిపోయిందని, జర్నలిస్టులు, పౌరసమాజంపై దాడులు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. తాము భారత్‌లోని ఏ పార్టీ, నాయకుడికి మద్దతుదారులం కాదు. అమెరికా విదేశాంగ విధానంలోని ముఖ్యమైన సూత్రానికి కట్టుబడి చర్చించాలని కోరుతున్నాం అని వారు లేఖలో పేర్కొన్నారు.


