బ్రిటన్‌లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జులై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు బ్రిటన్ పార్లమెంట్ రద్దైంది. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఇక బ్రిటన్ పార్లమెంట్‌లో మొత్తం 650 మంది సభ్యులు ఉన్న విషయం తెలిసిందే. పార్లమెంట్ రద్దుతో ఐదు వారాల ఎన్నికల ప్రచారం నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది.

జులై 4న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే, ప్రధానిగా సునాక్ తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నా యి. ఈ ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.
