సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో ప్రవాసాంధ్రులు రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం ఆధ్వర్యంలో దీపావళి సంబురాలను ఉత్సాహాభరితంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తాము రియాధ్ నగరంలో ఉమ్మడి కుటుంబంగా దీపావళిని జరుపుకొంటున్నట్లుగా ప్రధాన నిర్వహకుడు తిరుపతి స్వామి స్వర్ణ అలియాస్ స్వామి తెలిపారు. తోటి తెలుగు ప్రవాసీయులందరూ కలిసి సహకరించడంతో దీపావళి వైభవంగా జరిగిందని తిరుపతి స్వామి చెప్పారు. తెలుగు పెద్దలు ఆంటొనీ సూచనలు, తోడ్పాటుతో తాము తెలుగు వారికి సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. హెల్పింగ్ హ్యాండ్స్ రియాధ్ పేరిట తాము ఆపదలో ఉన్న ప్రవాసీయుల కోసం సహాయక చర్యలు కూడా చేపట్టినట్లుగా స్వామి తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్‌ను తాము 2020లో నెలకొల్పినట్లుగా ఆయన వెల్లడించారు.
రియాధ్ తెలుగు కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో తాము గత నాలుగు సంవత్సరాలుగా దీపావళి, సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలను మురారి, బిందు, శ్రీదేవి, రమ్య, అక్షితలు పర్యవేక్షించడమే కాకుండా ప్రదర్శనకారులకు శిక్షణ కూడా ఇచ్చారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను మధు, ప్రసాద్, నటరాజ్, మహేంద్ర, భాస్కర్‌లు పర్యవేక్షించారు. కార్యక్రమ నిర్వహణలో నటరాజ్, భరణి, అనిల్ మర్రి, వినయ్, సుఖేశ్, నాగేంద్ర, విజయ్, శేషు, శ్రవణ్, విశ్వలు సహకరించారని స్వామి తెలిపారు.














