Namaste NRI

వేలంకు టైటానిక్‌ తలుపు.. ఎంత ధర పలికిందో తెలుసా?

జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందిన టైటానిక్‌ చిత్రం పేరు వినగానే 1500 మంది మృత్యువాత పడిన విషాద ఘటనతో పాటు అద్భుతమైన ప్రేమ కావ్యం మన కళ్ల ముందు కదలాడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరోయిన్‌ రోజ్‌ను రక్షించడం కోసం హీరో కేట్‌ జాక్‌ పాత్రధారి ఒక తలుపు చెక్కపై ఆమెను ఉంచి తాను ప్రాణాలు విడిచే సన్నివేశం చాలామంది మర్చిపోలేరు.  ఆ డోర్‌ రికార్డు స్థాయిలో 718,750 డాలర్ల (సుమారు 6 కోట్ల రూపాయలు)కు వేలంలో అమ్ముడు పోయింది. హెరిటేజ్‌ ఆక్షన్‌ ట్రెజర్స్‌లో ఈ టైటానిక్‌ అవశేషం అత్యధిక వసూలు సాధించిన వస్తువుగా నిలిచింది. వాస్తవానికి అది తలుపు చెక్క కాదు. ఓడ ఫస్ట్‌ క్లాస్‌ లాంజ్‌ ప్రవేశద్వారం పైన ఉన్న డోర్‌ ఫ్రేమ్‌లోని భాగాన్నే తలుపు చెక్కగా చూపించినట్టు నిర్మాతలు తెలిపారు. విన్స్‌లెట్‌ వాడిన షిఫాన్‌ డ్రెస్‌ సైతం వేలంలో 125,000 డాలర్ల (రూ.1.05 కోట్లు) ధర పలికింది.

Social Share Spread Message

Latest News