Namaste NRI

30మంది అధికారులకు ఉరి..ఎందుకో తెలుసా?

ఉత్తరకొరియా నియంత కిమ్‌ మరో దారుణానికి పాల్పడ్డారు. దాదాపు 30 మంది అధికారులను ఉరి తీయించిన ట్టు సమాచారం. ఇటీవల వరదలు రావటంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. అయితే, ప్రాణ, ఆస్తినష్టాలు నివారించటంలో అధికారులు విఫలం అయ్యారని, అందుకే వారినందరినీ ఉరి తీయాలని కిమ్‌ ఆదేశించినట్టు తెలిసింది. గత నెలలో ఆ అధికారులకు మరణ దండన విధించారని వెల్లడించింది.

 ఇటీవ‌ల చాగంగ్ ప్రావిన్సులో వ‌చ్చిన వ‌ర‌ద‌ల వ‌ల్ల వేలాది మంది మ‌ర‌ణించారు. అనేక మంది నిరాశ్ర‌యుల‌ య్యారు. ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని నివారించ‌లేక‌పోయిన అధికారుల‌కు మ‌ర‌ణ దండ‌న విధిస్తున్న‌ట్లు ఉత్త‌ర కొరియాపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఉత్త‌ర కొరియా అధికారులు వెల్ల‌డించారు.

Social Share Spread Message

Latest News