అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్ జంటగా నటిస్తున్న చిత్రం వెడ్డింగ్ డైరీస్. వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తు న్నారు. ఈ చిత్రం లో చమ్మక్ చంద్ర, జయలలిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ వినోదంతో కూడిన ప్రేమకథ ఇది. రీసెంట్ అండ్ రీస్టార్ట్ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోతుందా? అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిస్తున్న ఈ లవ్‌స్టోరీలో ప్రతీ అంశం ఆసక్తికరంగా ఉంటుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మదీన్ ఎస్కే.


