
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్‌లో ఉభయసభలను ఉద్దేశించి ఆయన అతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు గంటా 50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడారు. తన ప్రసంగాల్లో ఇదే అతిసుదీర్ఘమైందిగా రికార్డుకెక్కింది. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అత్యధికంగా 90 నిమిషాల పాటు మాట్లాడారు. ఇప్పుడు ఆ రికార్డును ట్రంప్ బ్రేక్ చేశారు. గత ఏడాది మార్చిలో కూడా ట్రంప్ సుమారు 100 నిమిషాల పాటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ట్రంప్ తన ప్రసంగంలో ఎక్కువగా ఆర్థిక ఎజెండా గురించి ప్రస్తావించారు.















