Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ మనవరాలి కోసమే ఆ పని చేశా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసమైన మార్‌ ఎ లాగో  గోడ దూకేందుకు యత్నించిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా, అతడు వారిని షాక్‌ గురిచేసే సమాధానం చెప్పాడు. తాను డొనాల్డ్‌ ట్రంప్ మనవరాలు కై ట్రంప్‌ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, అందుకే గోడ దూకే ప్రయత్నం చేశానని తెలిపాడు.

ఆంథోనీ థామస్‌ అనే 23 ఏళ్ల వ్యక్తి ట్రంప్‌ ఇంటి గోడ దూకేందుకు యత్నించాడు. అది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు గోడ దూకే ప్రయత్నం చేశావని వారు ప్రశ్నించగా,  అతడు షాకింగ్‌ సమాధానం ఇచ్చాడు. తాను ట్రంప్‌నకు ఒక శుభవార్త చెప్పడానికి వెళ్లానని, ఆయన మనవరాలు కై ట్రంప్‌ను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని థామస్‌ తెలిపాడు.

కాగా థామస్‌ ట్రంప్‌ ఇంటి గోడ దూకడం ఇది రెండోసారని అధికారుల విచారణలో తేలింది. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నట్లు ఆయన తెలిపారు. థామస్‌ రెండోసారి తన ఇంటి గోడ దూకే ప్రయత్నం చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ వాషింగ్టన్‌లో ఉన్నారని, దీనిపై ఆయనకు సమాచారం అందించామని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం థామస్‌ను పామ్‌బీచ్‌లోని జైలుకి తరలించారు.

Social Share Spread Message

Latest News